వ్యవసాయ రంగంలో బ యోటెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించవచ్చ ని, బయోటెక్నాలజీపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకర్‌లాల్ గార్గే అన్నారు.
బయోటెక్నాలజీతో అధిక ఉత్పత్తి
Dec 16 2016 2:19 AM | Updated on Sep 4 2017 10:48 PM
భీమవరం : వ్యవసాయ రంగంలో బ యోటెక్నాలజీని ఉపయోగించడం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించవచ్చ ని, బయోటెక్నాలజీపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకర్‌లాల్ గార్గే అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెం డు రోజులు పాటు నిర్వహించే ‘ఎమర్జింగ్ మల్టీడిసిప్లీన్ రీసెర్చ్ అండ్ కం ప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. అమెరికాలో బయోటెక్నాలజీని ఉపయోగించి 30 శాతం పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించారన్నారు. పర్యావరణ శుద్ధికి, పరిరక్షణకు బయోటెక్నాలజీ మొక్కలను పారిశ్రామిక వాడలతో పాటు అన్ని చోట్లా విస్తృతంగా నాటాలన్నారు. కళాశాల పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఐ.హేమలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ ఎస్‌వీ రంగరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారథివర్మ, సీఈవో ఎస్‌ఆర్‌కే నిశాంత్‌వర్మ, డాక్టర్ పీఆర్‌కే రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్‌ఎన్ రాజు, బి.మధుసూదన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement