కరీంనగర్ క్రైం : కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో మోహన్‌రెడ్డి?
Aug 23 2016 12:01 AM | Updated on Aug 20 2018 4:27 PM
కరీంనగర్ క్రైం : కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి తన చావుకు మోహన్‌రెడ్డే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అయితే తమ తండ్రి ఆత్మహత్యతో మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమార్తె పోలీసులకు లిఖితపూర్వంగా రాసిచ్చిన విషయం విదితమే. అయినప్పటికీ ఈ కేసులో మోహన్‌రెడ్డిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement