గడికోటలో ఎమ్మెల్యే పూజలు | mla prayers at gadikota | Sakshi
Sakshi News home page

గడికోటలో ఎమ్మెల్యే పూజలు

Oct 6 2016 5:52 PM | Updated on Sep 4 2017 4:25 PM

గడికోటలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

గడికోటలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పేట గడికోటలో అమ్మవారికి గురువారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్దశంకరంపేట: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పేట గడికోటలో అమ్మవారికి గురువారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి హారతి ఇచ్చారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. గడికోట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం పురాతన కోటను ఎక్కి పేట అందాలను తిలకించారు. పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాయిని సంగమేశ్వర్‌, సర్పంచ్‌ జంగం శ్రీనివాస్‌, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు విజయరామరాజు, కల్హేర్‌ మాజీ ఎంపీపీ మల్లేషం, నాయకులు లక్ష్మణ్‌, పున్నయ్య, నారాయణ, దాదిగారి రాధాక్రిష్ణ, అమర్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement