‘సర్దార్‌నగర్ మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా’ | minister mahendar reddy visit sardar nagar marcket yard in rangareddy district | Sakshi
Sakshi News home page

‘సర్దార్‌నగర్ మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా’

Jun 14 2016 4:03 PM | Updated on Mar 28 2018 11:26 AM

సర్దార్‌నగర్ మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

షాబాద్: సర్దార్‌నగర్ మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన శేరిగూడెం వెంకటయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ జిల్లాలోనే పెద్ద కమిటీ అని అన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా పాలక మండలి పని చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement