సంస్మరణ వారోత్సవాలపై పోస్టర్లు | Memorial posters varotsavalapai | Sakshi
Sakshi News home page

సంస్మరణ వారోత్సవాలపై పోస్టర్లు

Jul 21 2016 11:49 PM | Updated on Sep 4 2017 5:41 AM

మరుల ఫొటోలతో ముద్రించిన పోస్టర్లు

మరుల ఫొటోలతో ముద్రించిన పోస్టర్లు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఊరూరా నిర్వహించాలని సీపీఐ(మావోయిస్టు) పార్టీ పిలుపునిచ్చింది

చర్ల : అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు ఊరూరా నిర్వహించాలని సీపీఐ(మావోయిస్టు) పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట మండల కేంద్రంలోని లక్ష్మీకాలనీ, అంబేద్కర్‌ నగర్, పూజారిగూడెంలో వాల్‌పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. ప్రజల పక్షాన పోరాటాలు చేసి.. వారి కోసం అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. నివాళులర్పించాలని కోరుతూ ఫొటోలతోపాటు ముద్రించిన వాల్‌పోస్టర్లు వేశారు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వర్ధిల్లాలి అంటూ మావోయిస్టు పార్టీ కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా కోరింది. కాగా, ఆయా కాలనీలు, గ్రామాల్లో వెలసిన పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement