టీటీసీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌! | mass copying in ttc exams | Sakshi
Sakshi News home page

టీటీసీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌!

Nov 7 2016 10:29 PM | Updated on Sep 4 2017 7:28 PM

టీటీసీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌!

టీటీసీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌!

స్థానిక పాతపేట ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న టీటీసీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోంది.

డోన్‌ టౌన్‌ : స్థానిక పాతపేట ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న టీటీసీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌   జరుగుతోంది.  ఈనెల 3వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను 263 మంది విద్యార్థులు రాస్తున్నారు.  

మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందనే సమాచారంతో సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లిన విలేకరులను చూసి ఇన్విజిలేటర్లు విద్యార్థులను అలర్ట్‌ చేశారు. దీంతో విద్యార్థులు కిటికీల గుండా కాపీలను పారవేశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మకాం వేసిన కొందరు కాపీలను పరీక్షా కేంద్రంలోకి పంపుతుండడం గమనార్హం.  దీనిపై చీఫ్‌ ఇన్విజిలేటర్‌ మైకేల్‌ వివరణ కోరగా  మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పుకొచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement