ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్ మృతి | Maoist commander killed in encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కమాండర్ మృతి

Mar 25 2016 8:03 PM | Updated on Oct 9 2018 2:49 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం కొండగావ్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు జన్ మిలీషియా కమాండర్ సుధ్‌రాం మృతి చెందాడు.

చింతూరు :ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం కొండగావ్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు జన్ మిలీషియా కమాండర్ సుధ్‌రాం మృతి చెందాడు. మర్దాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల సంచారం ఉందనే సమాచారం మేరకు కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు బలగాలు తిరిగి వస్తున్నాయి. ఆ క్రమంలో అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి తెలిపారు.

కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో కుదూర్ ఏరియా జన్ మిలీషియా కమాండర్ సుధ్‌రాం అలియాస్ సుఖ్‌రాం కశ్యప్ మృతదేహం, ఓ తుపాకీ, పేలుడు సామగ్రి లభ్యమైనట్లు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జిన్నారంలో శుక్రవారం అరెస్టు చేసినట్లు ఐజీ తెలిపారు. అరెస్టయిన మావోయిస్టులంతా సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందినవారని, వీరంతా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఐజీ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement