గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తెంగడి గ్రామానికి చెందిన చారమ్మ(36)ను ఆమె భర్త మరియబాబు తలపై మోది హతమార్చి తనూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
దాచేపల్లి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తెంగడి గ్రామానికి చెందిన చారమ్మ(36)ను ఆమె భర్త మరియబాబు తలపై మోది హతమార్చి తనూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. చారమ్మ, మరియబాబు దంపతులు గత కొన్నేళ్లుగా గొడవలు పడుతున్నారు.
ఆదివారం ఉదయం గొడవ తారాస్థాయికి చేరడంతో ఆవేశంలో మరియబాబు రోకలిబండతో చారమ్మ తలపై బాది హతమార్చాడు. అనంతరం తనూ పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు మరియబాబును ఆస్పత్రికి తరలించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.