వడదెబ్బకు వ్యక్తి మృతి | man dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వ్యక్తి మృతి

Mar 24 2017 11:15 PM | Updated on Sep 5 2017 6:59 AM

గుమ్మఘట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన గజ్జి తిప్పయ్య(58) అనే వ్యక్తి శుక్రవారం వడదెబ్బతో మృతి చెందాడని బంధువులు తెలిపారు.

గుమ్మఘట్ట : గుమ్మఘట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన గజ్జి తిప్పయ్య(58) అనే వ్యక్తి శుక్రవారం వడదెబ్బతో మృతి చెందాడని బంధువులు తెలిపారు. వంట చెరుకు కోసం గ్రామ సమీపంలోని ఉడిపి రాయుడి గుట్ట వద్దకు వెళ్లిన అతను వడదెబ్బకు గురై కిందపడిపోయాడని వివరించారు. ఆ వెంటనే వాంతులు చేసుకుని క్షణాల్లో ప్రాణాలు ఒదిలినట్లు తెలిపారు. కూలీలు గమనించి విషయాన్ని గ్రామంలో తెలపడంతో మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే  తహసీల్దార్‌ అఫ్జల్‌ఖాన్‌, వైద్యాధికారి రమేశ్‌ గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. వడదెబ్బతోనే మృతి చెందినట్లు డాక్టర్‌ నిర్ధరించారు. మృతుడికి కుమారుడు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement