మేనల్లుడి చేతిలో అత్త హతం | Man brutally murdered Mother in law | Sakshi
Sakshi News home page

మేనల్లుడి చేతిలో అత్త హతం

Oct 2 2016 10:58 AM | Updated on Sep 4 2017 3:55 PM

అల్లుడి చేతిలో అత్త హత్యకు గురైంది. ఈ సంఘటన కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చోటుచేసుకుంది.

కంచికచర్ల (కృష్ణా జిల్లా) : అల్లుడి చేతిలో అత్త హత్యకు గురైంది. ఈ సంఘటన కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. బొర్రా సత్యవతి(55) అనే మహిళను ఆమె మేనల్లుడు దామోదర రత్నాకర్ చౌదరి(27) బండతో తలపై మోది హత్య చేశాడు. రత్నాకర్‌కు మతిస్థిమితం సరిగ్గా ఉండదు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సంఘటనాస్థలాన్ని నందిగామ సీఐ పచ్చి నారాయణ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement