మధ్వసిద్ధాంతం మహోన్నతం | madvasiddhamtham | Sakshi
Sakshi News home page

మధ్వసిద్ధాంతం మహోన్నతం

Nov 5 2016 9:50 PM | Updated on Sep 4 2017 7:17 PM

మధ్వసిద్ధాంతం మహోన్నతమైనదని ఉత్తరాధి మఠాధీశులు శ్రీసత్యాత్మతీర్థ స్వామిజీ తెలిపారు. రామారావుపేటలోని మధ్వసభ సమావేశ మందిరంలో స్వామిజీ శనివారం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. మధ్వ గృహస్తులు అచరించాల్సిన నియమా లు, సిద్ధాంతాలను మధ్వాచార్యులు తెలియజేశారని, వాటిని అనుసరిచించడం ద్వారా జన్మను సార్థకత చేసుకోవాలన్నారు. కాకినాడ మధ్వసభ కమిటీ ప్రతినిధి రాచూరి

  • ఉత్తరాధి మఠాధీశులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ
  • కాకినాడ కల్చరల్‌ : 
    మధ్వసిద్ధాంతం మహోన్నతమైనదని ఉత్తరాధి మఠాధీశులు శ్రీసత్యాత్మతీర్థ స్వామిజీ తెలిపారు. రామారావుపేటలోని మధ్వసభ సమావేశ మందిరంలో స్వామిజీ శనివారం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. మధ్వ గృహస్తులు అచరించాల్సిన నియమా లు, సిద్ధాంతాలను మధ్వాచార్యులు తెలియజేశారని, వాటిని అనుసరిచించడం ద్వారా జన్మను సార్థకత చేసుకోవాలన్నారు. కాకినాడ మధ్వసభ కమిటీ ప్రతినిధి రాచూరి రాఘవేంద్ర స్వామి మాట్లాడు తూ కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని మధ్వ గృహస్తులకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వాసుదేవాచార్, నరసింహాచార్, తాడూరి రంగారావు, కొప్పెల్ల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement