ప్రేమకు సరిహద్దులు అడ్డురావని రుజువు చేశారు వెంకటాపురం గ్రామానికి చెందిన నూతన దంపతులు. స్థానిక క్రైస్తవ మందిర సంఘ కాపరి గొల్లమందల నాగేశ్వరరావు, అన్నవజ్రంల కుమారుడు చిట్టిబాబు(అహోరాను)కు అమెరికాకు చెందిన ఆన్, మిషెల్‌ల కుమార్తె అలెక్సీస్
అమెరికా అమ్మాయి.. వెంకటాపురం అబ్బాయి..
Mar 20 2017 1:10 AM | Updated on Apr 4 2019 3:25 PM
	వెంకటాపురం(రంగంపేట): 
	 
					
					
					
					
						
					          			
						
				
	ప్రేమకు సరిహద్దులు అడ్డురావని రుజువు చేశారు వెంకటాపురం గ్రామానికి చెందిన నూతన దంపతులు. స్థానిక క్రైస్తవ మందిర సంఘ కాపరి గొల్లమందల నాగేశ్వరరావు, అన్నవజ్రంల కుమారుడు చిట్టిబాబు(అహోరాను)కు అమెరికాకు చెందిన ఆన్, మిషెల్‌ల కుమార్తె అలెక్సీస్ సెమెస్కోతో శనివారం వివాహమైంది. విశాఖపట్నంలో పాస్టర్‌గా పనిచేస్తూ, సువార్త సభల నిర్వహణలో విశిష్ట సేవలందించిన చిట్టిబాబుతో పరిచయమవడం ఇరుపెద్దల ఒప్పందం మేరకు వివాహం జరిగిందని నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి నూతన వధూవరులను పలువురు ఆశీర్వదించారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
