లారీ ఢీ కొని ముగ్గురికి గాయాలు | Lorry Hit.. Three Are Injured | Sakshi
Sakshi News home page

లారీ ఢీ కొని ముగ్గురికి గాయాలు

Dec 6 2016 10:52 PM | Updated on Sep 4 2017 10:04 PM

లారీ ఢీ కొని ముగ్గురికి గాయాలు

లారీ ఢీ కొని ముగ్గురికి గాయాలు

స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులో లారీ ఢీ కొన్న ఘటనలో టీవీఎస్‌ ఎక్సెల్‌ ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరికి,, సైకిల్‌లో వెళ్తున్న మరొకరికి గాయాలయ్యాయి.

ప్రొద్దుటూరు క్రైం: స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులో లారీ ఢీ కొన్న ఘటనలో టీవీఎస్‌ ఎక్సెల్‌ ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరికి,, సైకిల్‌లో వెళ్తున్న మరొకరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు రూరల్‌ పరిధిలోని నంగనూరుపల్లెకు చెందిన బొంతల సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్యలు టీవీఎస్‌ ఎక్సెల్‌లో మంగళవారం ఉదయం ప్రొద్దుటూరుకు బయలుదేరారు. వారు పాలకేంద్రం సమీపంలోకి వెళ్లగానే ఎర్రగుంట్ల వైపు నుంచి వస్తున్న లారీ వారి టీవీఎస్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్యతో పాటు వారికి సమీపంలో సైకిల్‌పై వస్తున్న అయ్యప్ప మాలధారుడు  కందుకూరి నాగరాజుకు కూడా గాయాలయ్యాయి. ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన నాగరాజు అయ్యప్ప ఆలయంలో పూజ చేసుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement