లవ్‌ పండుగ చేద్దాం ఇలా.. | Let us love this festival .. | Sakshi
Sakshi News home page

లవ్‌ పండుగ చేద్దాం ఇలా..

Feb 14 2017 10:56 PM | Updated on Sep 5 2017 3:43 AM

లవ్‌ పండుగ చేద్దాం ఇలా..

లవ్‌ పండుగ చేద్దాం ఇలా..

ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనుకునేవారికి నగరంలోని వివిధ రకాలు ఏర్పాట్లు జరిగాయి.

పెదగంట్యాడ : ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనుకునేవారికి నగరంలోని వివిధ రకాలు ఏర్పాట్లు జరిగాయి. అందులో కొన్ని మీకోసం... పార్క్‌ హోటల్‌లో ః ఆక్వా డైనింగ్‌ హాల్‌లో స్పెషల్‌ డిన్నర్‌ ఉంది. కుదరదనుకుంటే పార్క్‌ హోటల్‌లోనే విస్తా హాల్‌లో లంచ్‌ ఏర్పాటు చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం వైజాగ్‌ కమేడియన్‌ ఫీట్‌ పేరుతో ఒక షో సాయంత్రం జరుగుతుంది.   నోవాటెల్‌లో ః ఇక్కడ కూడా ప్రేమికుల రోజు స్పెషల్‌ లంచ్‌ డిన్నర్‌తో పాటు నియోన్‌ మ్యూజికల్‌ ఫెస్టివల్‌ జరుగనుంది. కొత్త ప్రేమికులకు లైవ్‌ మెలోడీ సాంగ్స్‌తో విందు ఏర్పాటు చేస్తారు..

సిటీ దాటి వెళ్లాలనుందా...
లంబసింగి డ్యామ్‌ దగ్గర ట్రైబల్స్‌ చలి కాలం చేసుకునే పండుగ ఉంది. అక్కడి గిరిజనులు ఉదయాన్నే డ్యామ్‌ దగ్గర పండుగ చేసుకుంటారు. ట్రావెలర్స్‌ చాలా మంది వెళ్లి పాల్గొంటారు. అక్కడ టెంట్‌లు కూడా దొరుకుతాయి. ఈ పండుగ ప్రేమికుల రోజు కూడా కావడంతో ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నారు.  

అరకు వెళదాం..
సాగా ట్రావెల్స్‌ అరకు వెళ్లడడానికి ప్రత్యేకంగా బస్‌ను ఏర్పాటు చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ట్రావెల్‌ చేస్తూ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే ఎంచక్కా బస్‌ ఎక్కెయ్యోచ్చు.

బెలూన్‌ బ్లాస్ట్‌..
బీచ్‌ రోడ్‌లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. టీ ట్రైల్స్‌నే ఫుడ్‌ బిజినెస్‌ చేసే వాళ్లు దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వాలైంటైన్స్‌ డే స్పెషల్‌ బెలూన్స్‌ ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన దాన్ని పగలగొట్టొచ్చు. దానిలో వోచర్స్‌ ఉంటాయి. మీరు లక్కీ అయితే మీకు లంచ్, డిన్నర్‌లో డిస్కౌంట్‌ లేదా పూర్తి ఫ్రీగా కూడా పొందవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement