వీరేశ్వరుని ఆలయానికి లక్షదీప శోభ | laksha deepa sobha | Sakshi
Sakshi News home page

వీరేశ్వరుని ఆలయానికి లక్షదీప శోభ

Nov 29 2016 10:46 PM | Updated on Sep 4 2017 9:27 PM

మురమళ్లలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం లక్షదీప శోభతో మెరిసిపోయింది. కార్తిక మాసం చివరి రోజైన మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తరలివచ్చిన అశేషజనవాహినితో ఆలయం కిటకిటలాడింది. లక్ష దీపాలంకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన

ఐ.పోలవరం :
మురమళ్లలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం లక్షదీప శోభతో మెరిసిపోయింది. కార్తిక మాసం చివరి రోజైన మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తరలివచ్చిన అశేషజనవాహినితో ఆలయం కిటకిటలాడింది. లక్ష దీపాలంకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్టింగు భక్తులను ఎంతో ఆకట్టుకొంది. లోపల, బయట భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయం కొత్త కాంతులను అద్దుకొంది. ఆలయ ఆవరణలో శివలింగం, త్రిశూలం, సూర్యుడు, ఓంకారం తదితర ఆకృతుల్లో దీపాలను వెలిగించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పూజలు నిర్వహించారు. దీపోత్సవం విశిష్టత గురించి పరిపూర్ణానందస్వామి శిషు్యరాలు గీతావాణి చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.
 

Advertisement

పోల్

Advertisement