పెరుగుతున్న లక్నవరం | laknavaram lake water level increasing | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న లక్నవరం

Sep 28 2016 12:43 AM | Updated on Sep 4 2017 3:14 PM

పెరుగుతున్న లక్నవరం

పెరుగుతున్న లక్నవరం

గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మత్తడి పోస్తూ పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సుమారు అడుగున్నరకు పైగా ఎత్తుతో మత్తడి పోస్తుండడంతో సరస్సు తూముల వద్దకు వెళ్లే అవకాశం లేకుండా లోలెవల్‌ కాజ్‌వే పైనుండి నీరు వెళుతోంది. ఉయ్యాలవంతెన సరస్సుపై తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది.

గోవిందరావుపేట :  గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మత్తడి పోస్తూ పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సుమారు అడుగున్నరకు పైగా ఎత్తుతో మత్తడి పోస్తుండడంతో సరస్సు తూముల వద్దకు వెళ్లే అవకాశం లేకుండా లోలెవల్‌ కాజ్‌వే పైనుండి నీరు వెళుతోంది. ఉయ్యాలవంతెన సరస్సుపై తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మత్తడి పరవళ్లు తొక్కుతుండడంతో దయ్యాలవాగు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు నీటిలో మునుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement