అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళ
మండలంలోని గర్భాం జంక్షన్ వద్ద గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గర్భాం జంక్షన్ వద్ద గుర్తు తెలియని మహిళ పడిఉండటాన్ని గుర్తించిన పలువురు 108కి సమాచారం ఇచ్చారు.
గర్భాం జంక్షన్(మెరకముడిదాం): మండలంలోని గర్భాం జంక్షన్ వద్ద గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గర్భాం జంక్షన్ వద్ద గుర్తు తెలియని మహిళ పడిఉండటాన్ని గుర్తించిన పలువురు 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి చీపురుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాని ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో విజయనగరానికి తరలించారు. అయితే ఆమె వివరాలు, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.