రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి | labour dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

Aug 6 2017 9:52 PM | Updated on Aug 30 2018 4:10 PM

మండల కేంద్రమైన అమడగూరుకు చెందిన కుటాల నారాయణ (58) అనే కూలీ ఆదివారం బెంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

అమడగూరు: అ గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కుటాల నారాయణ కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి  బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడ వివిధరకాల పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పనులకు వెళ్లే నిమిత్తం నారాయణ ఆదివారం రోడ్డు దాటుతుండగా బీఎంటీసీ సిటీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement