కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపిక | krishna university basket ball team selected | Sakshi
Sakshi News home page

కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపిక

Nov 17 2016 10:38 PM | Updated on Sep 4 2017 8:22 PM

కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపిక

కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ జట్టు ఎంపిక

కృష్ణా విశ్వవిద్యాలయం బాస్కెట్‌ బాల్‌ జట్టు ఎంపికైంది. ఇటీవల యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల జట్ల మధ్య జరిగిన బాస్కెట్‌ బాల్‌ టోర్నీలో ప్రతిభచాటిన క్రీడాకారులతో యూనివర్సిటీ జట్టు ఎంపిక గురువారం మారిస్‌ స్టెల్లా కళాశాల ఇండోర్‌ స్టేడియంలో జరిగింది.

పటమట (ఆటోనగర్‌) : కృష్ణా విశ్వవిద్యాలయం బాస్కెట్‌ బాల్‌ జట్టు ఎంపికైంది. ఇటీవల యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల జట్ల మధ్య జరిగిన బాస్కెట్‌ బాల్‌ టోర్నీలో ప్రతిభచాటిన క్రీడాకారులతో యూనివర్సిటీ జట్టు ఎంపిక గురువారం మారిస్‌ స్టెల్లా కళాశాల ఇండోర్‌ స్టేడియంలో జరిగింది. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కుల్‌రేఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ నల్లూరు శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా ఆల్‌ ఇండియా బాస్కెట్‌ బాల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ జి.ఎస్‌.సి.బోసు హాజరయ్యారు. మ్యారీస్‌ స్టెల్లా ఇండోర్‌ స్టేడియంలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌లో సిద్ధార్ధ మహిళా కళాశాల మొదటి స్థానం, మ్యారీస్‌ స్టెల్లా కళాశాల రెండో స్థానం, కేబీఎన్‌ కాలేజీ మూడవ స్థానం, నున్న విజయ కాలేజీ నాలుగో స్థానంలో నిలిచాయి.
ఎంపికైన జట్టు
సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి ఎస్‌.కె.ఎస్తేరు రాణి, ఎస్‌.దివ్యవల్లి, వి.ఎల్‌.భవ్య, చంద్రలేఖ, తారాబాయి, మ్యారిస్‌ స్టెల్లా కళాశాల నుంచి రూబి అమూల్య, మౌనిక, నిహారిక, కె.భానుశ్రీ , కేబీఎన్‌ కాలేజీ నుంచి వాణి, కల్యాణి, నున్న విజయ కళాశాల నుంచి శ్రీలక్ష్మి ఎంపియ్యారు. సెలెక‌్షన్‌ కమిటీ సభ్యులుగా ఆంధ్రా లయోల కళాశాల ఫిజికల్‌ లెక్చరర్‌ జె.వి.ఎన్‌.ప్రసాద్, నూజివీడు డీఏఆర్‌ కళాశాల మహమ్మద్‌ అంజాద్‌ ఆలీ వ్యవహరించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement