కోటి లింగాల పుష్కరఘాట్లు జనంతో పోటెత్తారు. పావన గౌతమిలో స్నానమాడి పాపహరణం చేసుకున్నారు.
కరీంనగర్ : కోటి లింగాల పుష్కరఘాట్లు జనంతో పోటెత్తారు. పావన గౌతమిలో స్నానమాడి పాపహరణం చేసుకున్నారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పుష్కరస్నానం ఆచరించారు. కోటేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండి పోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పవిత్ర గోదావరిలో మునకలు వేస్తూ పుణ్యఫలాలు దక్కించుకున్నారు. గురువారం అమావాస్య కావడం వల్ల పిండప్రదానాలు చేసే వారు అధికంగా తరలివచ్చారు.
గోదావరి సంకల్పానికి దూరంగా పుష్కర స్నానం
గోదావరిలో పుష్కర స్నానం చేసి గోదావరి సంకల్పాన్ని చెప్పించుకుంటే సర్వ పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే కోటిలింగాలలో పాత ఘాట్లనే పుష్కర స్నానాలకు వినియోగిస్తున్నందున బ్రాహ్మణులను అక్కడికి అనుమతించడం లేదు. ఫలితంగా గోదావరి సంకల్పానికి భక్తులు దూరమవుతున్నారు.