ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్‌ ఖాయం | khaidi number 150 grand success guaranty | Sakshi
Sakshi News home page

ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్‌ ఖాయం

Jan 9 2017 10:34 PM | Updated on Sep 5 2017 12:49 AM

ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్‌ ఖాయం

ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్‌ ఖాయం

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్‌ ఆవుతుందని ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. గ్రామంలోని ఆయన చెల్లి, బావ కుంచే శ్రీదేవి శ్రీనివాస్‌ ఇంటికి సోమవారం ఆయన వచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

  • చిత్ర దర్శకుడు వీవీ వినాయక్‌
  • గాదరాడ (కోరుకొండ) :
    మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్‌ ఆవుతుందని ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు.  గ్రామంలోని ఆయన చెల్లి, బావ కుంచే శ్రీదేవి శ్రీనివాస్‌ ఇంటికి సోమవారం ఆయన వచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ చిత్రం అడ్వా¯Œ్స టికెట్లు బుక్కింగ్‌తోనే అన్ని రికార్డులు బద్ధలైనట్టు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిరంజీవితో తీసిన ఠాగూర్‌ చిత్రం హిట్‌ అయిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్, రష్యా దేశాల్లో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తీశామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని, చిరంజీవి అభిమానులు కోరుకున్నట్టుగా  ఉంటుందన్నారు. చిరంజీవి తనకు పెద్ద అన్నగా  ఉన్నారని, మెగా కుటుంబం మా కుటుంబానికి  అభిమానమన్నారు. ఇప్పటికి 15 సినిమాలకు దర్శకత్వం వహించానని తెలిపారు.
    గాదరాడలో సందడి 
    వినాయక్‌ రావడంతో గ్రామంలో సందడి నెలకుంది. ఆమె చెల్లెలు ఇంట వినాయక్‌ భోజనం చేశారు. ఇంతలో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు, పలువురు నాయకులు గ్రామానికి వచ్చి ఆయనను కలిశారు. వీరిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కాపు నేతలు, చిరంజీవి అభిమానులు, మహిళలు ఉన్నారు. వినాయక్‌తో ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement