రైతులకు రుణాలు అందించడంలో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రెండో స్థానంలో ఉందని బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు.
రుణాల మంజూరులో కేడీసీసీ బ్యాంకు రెండోస్థానం
Jan 20 2017 12:20 AM | Updated on Aug 13 2018 8:03 PM
నంద్యాల: రైతులకు రుణాలు అందించడంలో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రెండో స్థానంలో ఉందని బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆయన స్థానిక బ్రాంచ్‌లో గురువారం ఏటీఎం కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి ఏటీఎం ఇదేనని మరో 10ఏటీఎంలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా 23న శిరివెళ్లలో ఒకటి ప్రారంభిస్తామన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడం, రికవరీ చేయడంలో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల తర్వాత కర్నూలు ముందంజలో ఉందన్నారు. రైతులకు నగదు రహిత లావాదేవీల కోసం తమ బ్యాంక్ ఇచ్చే రూపేకార్డులు ఇతర బ్యాంకుల్లోనూ చెల్లుబాటు అవుతాయన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు షేక్‌అహమ్మద్ హుసేన్, డైరెక్టర్లు కొండారెడ్డి, ప్రతాపరెడ్డి, సీఈఓ రామాంజనేయులు, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, ఐఓబీ మేనేజర్ నాగపూర్ణిమా, బ్రాంచ్ మేనేజర్ తులశీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement