నారాయణరెడ్డి హత్య దారుణం | kapu ramachandrareddy comment on narayanareddy murder | Sakshi
Sakshi News home page

నారాయణరెడ్డి హత్య దారుణం

May 22 2017 12:18 AM | Updated on Jul 30 2018 6:12 PM

కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయడం దారుణమని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

రాయదుర్గం : కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయడం దారుణమని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పాలనలో ఆకృత్యాలు, హత్యలు, దౌర్జన్యాలు పెచ్చరిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణరెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని, లైసెన్స్‌డ్‌ ఆయుధం కొనసాగించాలని నారాయణరెడ్డి అనుమతి కోరినా ఇవ్వకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో హత్యలకు తెగబడడం సిగ్గుచేటన్నారు. హత్యకు గురైన నారాయణరెడ్డి, ఆయన అనుచరులు సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులకు కాపు ప్రగాఢసానుభూతిని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement