కల్యాణం.. కమనీయం | kalyanam kamaniyam | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Jul 20 2016 11:43 PM | Updated on Sep 4 2017 5:29 AM

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాక గ్రామంలో బుధవారం రాత్రి శివ, కేశువుల కల్యాణం ఒకవేదికపై శాస్త్రోక్తంగా నిర్వహించారు.


అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాక గ్రామంలో బుధవారం రాత్రి శివ, కేశువుల కల్యాణం ఒకవేదికపై శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీ సిద్దేశ్వరస్వామి, కామాక్షిదేవి, శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీదేవి, భూదేవి కల్యాణం రమణీయంగా కొనసాగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య  స్వామివార్ల కల్యాణం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి కల్యాణాన్ని తిలకించి తరించారు. అనంతరం శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను గజవాహనంపై ఊరేగించారు. కల్యాణమహోత్సవానికి టీటీడీ అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.    –రాజంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement