వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం | Kalyanam exposition venkatesvarasvami | Sakshi
Sakshi News home page

వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం

Aug 28 2016 9:59 PM | Updated on Sep 4 2017 11:19 AM

వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం

వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం

మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో వెంకటేశ్వరస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు.

 సదాశివపేట రూరల్‌ :మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో వెంకటేశ్వరస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు.  గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిఏటా కల్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువైన పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామికి అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా సుప్రభాతం, అభిషేకం చేశారు. అనంతరం ఆలయంలో గణపతిహోమం చేశారు.

ఈ  సందర్భంగా వెంకటాపూర్‌ గ్రామస్తులు, భక్తులు ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 10.05 గంటలకు  స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.  ఈ ఉత్సవంలో మండల, పట్టణ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం వెంకటేశ్వరుడు, అమ్మవార్ల విగ్రహాలను రథంలో ఉంచి వెంకటాపూర్‌ గ్రామంలో ఊరేగించారు. అ తర్వాత సదాశివపేట పట్టణంలోని పురవీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. సదాశివపేటలోని భక్తులు రథంలో కొలువైన వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement