697 అడుగులకు ‘కడెం’ నీటిమట్టం | kadem project | Sakshi
Sakshi News home page

697 అడుగులకు ‘కడెం’ నీటిమట్టం

Sep 1 2016 10:45 PM | Updated on Sep 4 2017 11:52 AM

కడెం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

కడెం : కడెం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పరివాహక కుప్టి, బోథ్, గుడిహత్నూర్, ఉట్నూర్, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌ తదితర ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జలాశయానికి జలకళ సంతరించింది. రెండు రోజుల క్రితం నీటిమట్టం 695 అడుగులు. గురువారం సాయంత్రం వరకు 697 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,497 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది.
        కాగా ఎడమ కాలువ ద్వారా 755 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 42 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు జేఈ తడమల్ల శ్రీనాథ్‌ విలేకరులకు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement