ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. అమరావతిలో ఉద్యోగాల భర్తీలను సీఆర్డీఏకు అప్పగిండచం దుర్మార్గమని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు కట్టబెట్టేందుకు కుట్ర జరగుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని రామకృష్ణ ఈ సందర్భంగా చంద్రబాబును డిమాండ్ చేశారు.