జడ్జి సరితపై సస్పెన్షన్‌ ఎత్తివేత | Judge to lift the suspension | Sakshi
Sakshi News home page

జడ్జి సరితపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Jul 28 2016 9:34 PM | Updated on Sep 4 2017 6:46 AM

జిల్లా కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి సరితపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు కోసం హైదరాబాద్‌లో జుడీషియల్‌ ఉద్యోగులు గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు.

నిజామాబాద్‌ లీగల్‌ : జిల్లా కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి సరితపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు కోసం హైదరాబాద్‌లో జుడీషియల్‌ ఉద్యోగులు గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో జడ్జి సరిత పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న 11 మంది జడ్జీలను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఇందులో సరిత ఒకరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్‌ ప్రత్యేక హైకోర్టు విషయాన్ని తాను చూస్తానని మొదట జుడీషియల్‌ అధికారులు విధుల్లో చేరాలని తెలపడంతో అధికారులు విధుల్లో చేరారు. అలాగే 11 మందిపై సస్పెన్షన్‌ ఎత్తివేసి వారిని విధుల్లోకి తీసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement