బెంగళూరుకు చెందిన జోలోస్టేస్ ప్రాపర్టీస్ కంపెనీలో ప్రాపర్టీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈనెల 9న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎ. కల్యాణి ఓ ప్రకటనలో తెలపారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : బెంగళూరుకు చెందిన జోలోస్టేస్ ప్రాపర్టీస్ కంపెనీలో ప్రాపర్టీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈనెల 9న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎ. కల్యాణి ఓ ప్రకటనలో తెలపారు. ఇంటర్, డిగ్రీ చేసి, 18–30 ఏళ్ల వయసు ఉన్న పురుషులు మాత్రమే అర్హులన్నారు.
25 ఖాళీలున్నాయని, జీతం నెలకు రూ. 10 వేలు ఉచిత భోజనం, వసతి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 9న ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08554–245547 నంబరులో సంప్రదించాలని
కోరారు.