19, 20 తేదీల్లో జాబ్‌మేళా | jobmela on 19th and 20th | Sakshi
Sakshi News home page

19, 20 తేదీల్లో జాబ్‌మేళా

Aug 18 2016 12:04 AM | Updated on Sep 4 2017 9:41 AM

సుజ్‌లాన్‌ విండ్‌ ఫవర్‌ ఎనర్జీ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్, సివిల్‌ ఇంజినీర్, ల్యాండ్‌ అక్విటేషన్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు ఈనెల 19, 20 తేదీల్లో స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సుజ్‌లాన్‌ విండ్‌ ఫవర్‌ ఎనర్జీ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్, సివిల్‌ ఇంజినీర్, ల్యాండ్‌ అక్విటేషన్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు ఈనెల 19, 20 తేదీల్లో స్థానిక ప్రభుత్వ బాలికల ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా/బీటెక్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ చేసిన వారు అర్హులని  పేర్కొన్నారు.


జీతం ఏడాదికి రూ. 2.50 లక్షలు ఉంటుందన్నారు. మొత్తం 100 దాకా పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ, విండ్‌ ప్రాజెక్టుల్లో కనీసం 4–10 ఏళ్లు పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎంపికైన వారు ఉత్తర భారతదేశం (ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక)లో పని చేయాల్సి ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు 08554–278944 నంబర్లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement