సత్తుపల్లి పట్టణంలో ఉద్రిక్తత | jac leaders protest at rtc depo in Sathupalli | Sakshi
Sakshi News home page

సత్తుపల్లి పట్టణంలో ఉద్రిక్తత

Nov 16 2016 10:19 AM | Updated on Sep 4 2017 8:15 PM

సత్తుపల్లిని జిల్లా కేంద్రం చేయాలంటూ నేటి నుంచి చేపడుతున్న బంద్ ఉద్రిక్తంగా మారింది.

సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిని జిల్లా కేంద్రం చేయాలంటూ పట్టణంలో నేటి నుంచి చేపడుతున్న 48 గంటల బంద్ ఉద్రిక్తంగా మారింది. బుధవారం తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులు బైఠాయించడంతో.. డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జేఏసీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం డిపో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement