ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.
తిరుపతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత విమానాశ్రయం ఎదురుగా ఉన్న శ్రీవెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
మొబైల్ తయారీ సంస్థల క్యూబికల్స్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.