ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | inter student suicides | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 24 2017 11:51 PM | Updated on Sep 5 2017 9:35 AM

ఇంటర్‌లో ఫెయిలైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మైలారం పల్లి గ్రామానికి చెందిన రైతుకూలీ శ్రీనివాసులు కుమార్తె జయశ్రీ(17) పామిడిలోని తన అవ్వ వద్ద ఉంటూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ హెచ్‌ఈసీ చదువుతోంది.

ఉరవకొండ : ఇంటర్‌లో ఫెయిలైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మైలారం పల్లి గ్రామానికి చెందిన రైతుకూలీ శ్రీనివాసులు కుమార్తె జయశ్రీ(17) పామిడిలోని తన అవ్వ వద్ద ఉంటూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ హెచ్‌ఈసీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఆమె ఫెయిల్‌ అయ్యింది. మనస్థాపానికి గురైన జయశ్రీ సోమవారం మైలారంపల్లిలోని తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఊరేసుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement