ఆత్మకూరు మండలం కరివేనలో ఇనాం భూమికి పట్టాలు ఇచ్చిన రిటైర్డ్ తహసీల్దారుపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ కర్నూలు ఆర్‌డీఓను ఆదేశించారు.
- గతంలో ఎమ్మిగనూరులోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో హాస్టల్ మూసేసే వరకు ట్యూటర్‌గా పనిచేశానని, బకాయి వేతనాలు ఇప్పించాలని ఓ మహిళ కోరగా విచారణ జరిపి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
- డోన్ పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ డీలరు వద్దకు దీపం కనెక‌్షన్ కోసం వెళ్తే కనెక‌్షన్‌తో పాటు స్టవ్ తదితర వాటికి నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కొండపేట వాసులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా డీఎస్‌ఓతో విచారణ జరిపిస్తామన్నారు.
- గోనెగండ్ల నాగేశ్వరరెడ్డి భార్య సర్పంచ్ కావడంతో ఆయన ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని కట్టడాలు సాగిస్తున్నారని, ఎవరైన ఫిర్యాదు చేస్తే తన అనుచరులతో దాడులు చేయిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు కోరారు.
- మద్దికెరలో సర్వే నెంబరు 554లో భూమిలో 33 సెంట్ల భూమిని వీఆర్‌ఓ తన తమ్ముని పేరుతో రిజిస్ర్టర్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు.


