కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో రైతుల సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం నీటి విడుదలను స్వల్పంగా పెంచారు.
డెల్టాకు నీటి విడుదల పెంపు
Aug 15 2016 12:41 AM | Updated on Sep 4 2017 9:17 AM
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో రైతుల సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం నీటి విడుదలను స్వల్పంగా పెంచారు. గత రెండు రోజుల నుంచి ఏడు వేల క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్న అధికారులు అదనంగా మరో 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రధానంగా పశ్చిమడెల్టా పరిధిలోని ఏలూరు, అత్తిలి కాలువలకు శనివారం కంటే నీటి విడుదలను కాస్త పెంచారు. మిగిలిన కాలువలకు రెండు రోజుల నుంచి ఒకే మాదిరిగా సరఫరా చేస్తున్నారు. గోదావరి నుంచి విడిచిపెడుతున్న ఏడువేల క్యూసెక్కుల్లో ఉండి కాలువకు 1,714, నరసాపురం కాలువకు 2,020, గోస్తనీ(జీఅండ్‌వీ)కి 1,035 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఏలూరు కాలువకు 1,180 క్యూసెక్కుల నుంచి 1,246 క్యూసెక్కులకు, అత్తిలి కాలువకు 578 నుంచి 793 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు.
తగ్గిన గోదావరి ఇన్‌ప్లో
గోదావరిలో ప్రవాహ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఇన్‌ఫ్లో 2,34,087 క్యూసెక్కులుగా నమోదైంది.
సాయంత్రం ఆరు గంటలకు 2,22,341 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో తగ్గింది.
Advertisement


