సరిపల్లె (గణపవరం) : ఎర్రకంకర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు.
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
Aug 11 2016 11:05 PM | Updated on Mar 28 2019 6:31 PM
సరిపల్లె (గణపవరం) : ఎర్రకంకర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండి మండలం మహదేవపట్నానికి చెందిన తంకెళ్ల శివనాగదుర్గా ప్రసాద్ (21) సొంత ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఎర్ర కంకర లోడు కోసం వెళ్లాడు. అక్కడ ఎర్రకంకరను లోడు చేసుకుని వస్తుండగా గణపవరం మండలం సరిపల్లె గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి పంట బోదెలో బోల్తా కొట్టింది. ట్రాక్టర్‌కు ట్రక్కుకు మధ్య ఉన్న పిన్ను విరగడంతో ట్రక్ శివనాగప్రసాద్‌పై పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్టేషన్ అసిస్టెంట్ ఎ.ఆనందబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement