4,11,725 కుటుంబాల సర్వే పూర్తి | in 4,11,725 families servey complete | Sakshi
Sakshi News home page

4,11,725 కుటుంబాల సర్వే పూర్తి

Aug 6 2016 10:49 PM | Updated on Sep 4 2017 8:09 AM

4,11,725 కుటుంబాల సర్వే పూర్తి

4,11,725 కుటుంబాల సర్వే పూర్తి

ఏలూరు (మెట్రో): జిల్లాలో ఇప్పటివరకూ 11 లక్షల 41 వేల 142 మంది సమగ్ర వివరాలను ప్రజాసాధికారి సర్వేలో నమోదు చేశామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు తెలిపారు.

ఏలూరు (మెట్రో): జిల్లాలో ఇప్పటివరకూ 11 లక్షల 41 వేల 142 మంది సమగ్ర వివరాలను ప్రజాసాధికారి సర్వేలో నమోదు చేశామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు తెలిపారు. విజయవాడ నుంచి జిల్లా జాయింట్‌ కలెక్టర్లతో శనివారం సాయంత్రం ప్రజాసాధికారిత సర్వేలో సాంకేతిక లోపాల నివారణపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో 39 లక్షల జనాభాకు సంబంధించి ప్రజాసాధికారి  సర్వే ప్రారంభించి నెల రోజులు గడవగా 4 లక్షల 11 వేల 725 కుటుంబాలకు చెందిన సమగ్ర సమాచారాన్ని సేకరించామని జేసీ కోటేశ్వరరావు తెలిపారు. సర్వేలో కచ్చితంగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని కృష్ణా జిల్లా జేసీ బాబు సూచించారు. డీఆర్వో ప్రభాకరరావు, హెచ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ దొర, ప్రజాసాధికారి సర్వే సమన్వయకర్త గంగరాజు పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement