మంత్రి రాజీనామా చేస్తే నేనూ రెడీ..!
వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తే, తాను పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని చైర్ పర్సన్ దేశం సులోచన సవాల్ విసిరారు.
– చైర్‌పర్సన్ దేశం సులోచన సవాల్
నంద్యాల: వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తే, తాను పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని చైర్ పర్సన్ దేశం సులోచన సవాల్ విసిరారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజాపాతినిధ్య చట్టం 1985 ప్రకారం ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన వారు మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉందని ఆమె గుర్తు చేశారు.
అఖిలప్రియ, ఆమె తండ్రి భూమానాగిరెడ్డి ఏడాదిన్నర క్రితమే టీడీపీలో చేరారని, కాని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదని, పైగా అఖిలప్రియ మంత్రి పదవిని కూడా స్వీకరించారన్నారు. మంత్రి పదవి పొందినందుకు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వైఎస్‌ఆర్‌సీపీ చేసిన సవాల్‌ను ఆమె స్వీకరించలేదన్నారు. అఖిలప్రియ రాజీనామా చేస్తే, క్షణాల్లో తాను కూడా రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు.
తనను రాజీనామా అడిగే అర్హత వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్‌కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సప్‌లో మహిళా కౌన్సిలర్లు ఉన్న గ్రూప్‌లో గంగిశెట్టి విజయ్‌కుమార్ అశ్లీల దృశ్యాలను పోస్ట్ చేశారని, దీనిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యిందని గుర్తు చేశారు. గత నెల మొదటి వారంలో జరిగిన అత్యవసర సమావేశంలో రూ.36కోట్ల పనులకు ప్రతిపాదనలను అజెండాలో పెడితే, ప్రస్తుత అధికార పార్టీ కౌన్సిలర్లు పదిమంది డీసెంట్ ప్రకటించి అభివృద్ధిని అడ్డుకున్నారని చైర్‌పర్సన్ దేశం సులోచన విమర్శించారు.