minister akhilapriya
-
మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ
- ఆ లేఖను ఆమెకే ఇచ్చి దొరికిపోయిన టీడీపీ నేత - నిందితుడి వద్ద పలువురు మంత్రుల నకిలీ లెటర్హెడ్లు సాక్షి, అమరావతి: పర్యాటక శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం ఏకంగా ఆ శాఖ మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని టీడీపీ నేత ఒకరు ఫోర్జరీ చేశారు. పైగా ఆ లేఖను సదరు మంత్రికే ఇవ్వడం బుధవారం సచివాలయంలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ.. తనకు వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని మంత్రి అఖిల ప్రియ సిఫారసు చేసినట్లు ఫోర్జరీ లేఖ సృష్టించాడు. ఆ లేఖతో సచివాలయంలో టూరిజం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను కలిశాడు. మంత్రి సంతకం ఉండటంతో ఆమెనే కలవాల్సిందిగా మీనా సూచించారు. అదే లేఖ తీసుకెళ్లి మంత్రి అఖిల ప్రియకు ఇవ్వగా.. తాను ఎప్పుడు సిఫారసు చేశానని ఆమె ప్రశ్నించడంతో లలీ ఖంగు తిన్నాడు. సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారని.. దీని సంగతేంటో చూడండి అని మంత్రి పేషీ సిబ్బందికి సూచించారు. వద్ద గుంటూరు జిల్లా టీడీపీ నేతల సంతకాలతో ఉన్న ఫోర్జరీ లేఖలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే సచివాలయం ఎస్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు అలీని అదుపులోకి తీసుకున్నారు. అలీ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్లు కూడా ఉన్నాయని మంత్రి పేషీ సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయమై అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ లేఖ చూసి ఆశ్చర్యమేసింది. నా మినిస్ట్రీ స్టాంప్ కూడా ఉంది. నా సంతకం ఫోర్జరీ చేసిన ఆలీ గతంలో నంద్యాలలో కూడా తిరిగాడు. వారంలో ఉద్యోగం ఇవ్వాలని నేను ఎవరికీ లేఖ ఇవ్వలేదు’ అన్నారు. అయితే అలీ టీడీపీ నేత కావడంతో అతను సాక్షాత్తూ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసినా అతనిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. -
మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ
-
టీడీపీ ఎమ్మెల్యేల హంగామా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హంగామా సృష్టించారు. బుధవారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగానే మొదలైనప్పటికీ.. పోలింగ్ శాతం పెరిగేకొద్దీ అధికారపార్టీలో అసహనం ఎక్కువైంది. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు పర్యటిస్తూ తమ పార్టీకి ఓటేయాలంటూ బాహాటంగానే ప్రజల్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల నిబంధనలను తోసిరాజని కర్నూలు, శ్రీశైలం, కోడుమూరు, బనగానపల్లె, అనపర్తి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మంత్రి అఖిలప్రియ సైతం రంగంలోకి దిగి నంద్యాల పట్టణంలో పలువార్డుల్లో పర్యటించారు. ఇంత చేస్తున్నా వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె నాగమౌనిక అయితే పోలింగ్ కేంద్రాల్లో దుర్భాషలాడుతూ హంగామా సృష్టించడం గమనార్హం. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు: అధికారపార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలను సైతం పట్టించుకోకుండా నంద్యాల నియోజకవర్గంలో ఇష్టానుసారంగా తిరిగారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చాపిరేవులలో పర్యటించి పార్టీ నేతలతో మాట్లాడి ఓట్లేయించే ప్రయత్నం చేశారు. ఇక బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి గోస్పాడు మండలంలోని యాళ్లూరులో ఏకంగా డీఎస్పీతోనే మాటామంతీ నిర్వహించారు. అదేరీతిలో కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖరరెడ్డిలు పట్టణంలోని నడిగడ్డ, ఎన్జీవో కాలనీలలో ప్రధానంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. చివరకు పదేపదే మీడియాలో రావడంతో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అదేబాటలో మంత్రి..: మంత్రి అఖిలప్రియ కూడా ఆళ్లగడ్డ నుంచి నంద్యాలలోకి అడుగుపెట్టారు. బుధవారం ఉదయం ఆళ్లగడ్డ నుంచి బయల్దేరి నంద్యాలకు చేరుకున్న ఆమె అనంతరం టీవీలకు అక్కడి అద్దెభవనం నుంచి ఇంటర్వ్యూలిచ్చారు. అంతేకాక దర్జాగా నంద్యాల నడివీధుల్లో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. -
మంత్రి రాజీనామా చేస్తే నేనూ రెడీ..!
– చైర్పర్సన్ దేశం సులోచన సవాల్ నంద్యాల: వైఎస్ఆర్సీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తే, తాను పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని చైర్ పర్సన్ దేశం సులోచన సవాల్ విసిరారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజాపాతినిధ్య చట్టం 1985 ప్రకారం ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన వారు మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉందని ఆమె గుర్తు చేశారు. అఖిలప్రియ, ఆమె తండ్రి భూమానాగిరెడ్డి ఏడాదిన్నర క్రితమే టీడీపీలో చేరారని, కాని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదని, పైగా అఖిలప్రియ మంత్రి పదవిని కూడా స్వీకరించారన్నారు. మంత్రి పదవి పొందినందుకు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వైఎస్ఆర్సీపీ చేసిన సవాల్‌ను ఆమె స్వీకరించలేదన్నారు. అఖిలప్రియ రాజీనామా చేస్తే, క్షణాల్లో తాను కూడా రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. తనను రాజీనామా అడిగే అర్హత వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్‌కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సప్‌లో మహిళా కౌన్సిలర్లు ఉన్న గ్రూప్‌లో గంగిశెట్టి విజయ్‌కుమార్ అశ్లీల దృశ్యాలను పోస్ట్ చేశారని, దీనిపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యిందని గుర్తు చేశారు. గత నెల మొదటి వారంలో జరిగిన అత్యవసర సమావేశంలో రూ.36కోట్ల పనులకు ప్రతిపాదనలను అజెండాలో పెడితే, ప్రస్తుత అధికార పార్టీ కౌన్సిలర్లు పదిమంది డీసెంట్ ప్రకటించి అభివృద్ధిని అడ్డుకున్నారని చైర్పర్సన్ దేశం సులోచన విమర్శించారు. -
మహానాడుకు టూరిజం బస్సులు
నంద్యాల: రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదవ లేదన్నట్లు టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ ఆదేశాలతో విశాఖపట్నంలో ప్రారంభమయ్యే టీడీపీ మహానాడుకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి రెండు టూరిజం బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వర్గీయులు శుక్రవారం భూమా కార్యాలయం, రాజ్‌థియేటర్ జంక్షన్ నుండి విశాఖపట్నంకు బయల్దేరారు. నంద్యాల నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా అఖిలప్రియ ఆ నియోజకవర్గంపై అమితాసక్తి కనపరుస్తున్నారు. ఈ విషయమై జిల్లా టూరిజం అధికారి బాపూజీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పరిధిలో టూరిజం శాఖకు బస్సులు లేవని.. మహానాడుకు బయల్దేరిన టూరిజం బస్సులు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదన్నారు.