అందరికీ ఆదర్శం.. జ్యోతిరెడ్డి జీవితం


  • నమ్మలేని విజయాలు ఆమె సొంతం

  • కష్టాలకు ఎదురొడ్డింది.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేతగా ఎదిగింది

  • రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతరావు

  • జ్యోతిరెడ్డికి శాంతిదూత అవార్డు బహూకరణ

  • సాక్షి, హన్మకొండ : జ్యోతిరెడ్డిని ప్రపంచానికి కె. రామచంద్రమూర్తి పరిచయం చేస్తే, ప్రపంచానికి వరంగల్‌ను జ్యోతిరెడ్డి పరిచయం చేసిందని ఆమె ప్రజలందరికి ఆదర్శమని రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు అన్నారు. వరల్డ్‌ పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ అందించే శాంతిదూత అవార్డుకు 2015 సంవత్సరానికి వరంగల్‌కు చెందిన ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి ఎం పికయ్యారు. ఈ మేరకు ఆదివారం హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవార్డు బçహూకరణ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె. రామచంద్రమూర్తి, జ్ఞానపీuŠ‡ అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్, వరల్డ్‌పీస్‌ ఫెస్టివల్‌ సభ్యులు సిరాజుద్దీన్, సిద్ధిఖీ, సాంబారి సమ్మారావు, బండా ప్రకాశ్, వాగ్దేవి విద్యాసంస్థల చైర్మన్‌ చందుపట్ల దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లక్ష్మీకాం తరావు మాట్లాడుతూ జ్యోతిరెడ్డి ఎన్నో నమ్మలేని విజయాల ను సొంతం చేసుకుని మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. కష్టాలకు ఎదురొడ్డి.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేతగా ఎదిగిందన్నారు. కష్టాల కడలిని ఈదే వారికి ఆమె జీవితం దిక్సూచి లాంటిదన్నారు. జ్యోతిరెడ్డి జీవితం వరంగల్‌కు సందేశం లాంటిదని పేర్కొన్నారు.

     

    పట్టుదలతో ఎదిగిన జ్యోతిరెడ్డి : రామచంద్రమూర్తి

    సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ విజయ్‌మాల్యా వంటి బడా పారిశ్రామిక వేత్తలు చేసిన అప్పులతో పోల్చితే.. రైతులు చేసే అప్పులు చాలా చిన్నవన్నారు. అప్పుల పాలైన రైతులు, ఆత్మన్యూనతా భావానికిలోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈఓగా ఎదిగిన ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి జీవితం ప్రతి ఒక్కరి కీ ఆదర్శమని  చెప్పారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి చనిపోదామనుకున్న మహిళ ఈస్థాయికి చేరుకోవడం వెనక ఎంతో కృషి దాగి ఉందన్నారు. జ్యోతిరెడ్డికి శాంతిదూత అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు జ్యోతిరెడ్డిపై ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్‌ వచ్చాయని.. త్వరలో సినిమా రాబోతుందని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన్‌పీuŠ‡ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ జ్యోతిరెడ్డి అనుమతి ఇస్తే ఆమె జీవిత గాధను నవలగా రాస్తానని చెప్పారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచిపోకుండా పుట్టిన ప్రాంతానికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి జ్యోతిరెడ్డి అని ఆయన అన్నారు. కాగా, జ్యోతిరెడ్డికి జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని ఆమె ఎదుర్కొన్న తీరును వరల్డ్‌పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ వ్యవస్థాపకుడు సిరాజు ద్దీన్‌ క్లుప్తంగా వివరించారు. ఐదు రూపాయల దినసరి వ్యవసాయ కూలి నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థకు అధిపతిగా జ్యోతిరెడ్డి ఎదిగారని ఆయన చెప్పారు.

    వరంగల్‌కు అన్నా హజారే

    జ్యోతిరెడ్డి ఫౌండేషన్‌ ద్వారా త్వరలో అన్నాహజారేను వరంగల్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మల్లికాంబ మనోవికాస కేంద్రం జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో ఉన్న 40 అనాథ శరణాలయాల విద్యార్థులకు ఇటీవల పోటీలు నిర్వహించి రూ .3 లక్షల విలువైన బహుమతు లు అందించిన గొప్ప వ్యక్తి జ్యోతిరెడ్డి అని ఆయన పేర్కొన్నా రు. అనంతరం జ్యోతిరెడ్డికి అతిథులు శాంతిదూత అవా ర్డును అందజేసి సత్కరించారు. 

     

    ఆసక్తి ఉంటే సాధించవచ్చు : జ్యోతిరెడ్డి  

    చేసే పనిపై ఆసక్తి ఉంటే లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చని శాంతిదూత అవార్డు గ్రహీత దూదిపాల జ్యోతిరెడ్డి అన్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు వందలసా ర్లు చచ్చిపోయి మళ్లీ పుట్టానని ఆమె పేర్కొన్నారు. పరిస్థితులతో సర్దుకుపోతే సమ స్య లేదని, వాటికి ఎదురుతిరిగితే ఈ సమా జం ఎంతో క్లిష్టంగా, కష్టంగా మారుతుందన్నారు. పురుషాధిక్య సమాజంలో మహిళలు పైకి రావడానికి అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పెళ్లైన తర్వాత జీవితం అయిపోయిందనుకునే ఆడవారికి నా జీవితం పెద్ద ఉదాహరణ అన్నారు. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కష్టాలకు ఎదురొడ్డి తాను ఈ స్థాయికి వచ్చాననని చెప్పారు. నో కాంప్రమైజ్‌.. నో కండీషన్‌ ఈజ్‌ పర్మనెంట్, నథింగ్‌ ఈజ్‌ ఇం పాజిబుల్‌ అనుకుని పనిచేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన సంఘటనలను జ్యోతిరెడ్డి గుర్తుకు చేస్తూ పలుమార్లు కంటనీరు పెట్టుకున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top