జాబ్‌మేళాకు భారీ స్పందన | huge responce to jobmela | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాకు భారీ స్పందన

Jul 30 2016 7:40 PM | Updated on Sep 4 2017 7:04 AM

జాబ్‌మేళాకు భారీ స్పందన

జాబ్‌మేళాకు భారీ స్పందన

భీమవరం : భీమవరం పట్టణంలోని శ్రీవిష్ణు కళాశాలల ప్రాంగణంలో శనివారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో భారీ జాబ్‌మేళా నిర్వహించారు.

భీమవరం : భీమవరం పట్టణంలోని శ్రీవిష్ణు కళాశాలల ప్రాంగణంలో శనివారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో భారీ జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 7,500 మంది హాజరయ్యారు. ఈ మేళాలో టెక్‌ మహేంద్ర, అపోలో, ప్లిప్‌కార్డ్, వరుణ్‌ మోటార్స్, బిగ్‌ సీ వంటి ప్రసిద్ధి చెందిన 16 సంస్థలు పాల్గొన్నాయి. జాబ్‌మేళాకు 10వ తరగతి నుంచి పీజీ వరకు 7,600 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని  జిల్లా స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ విభాగం అసోసియేట్‌ మేనేజర్‌ ఎ.కృష్ణారెడ్డి చెప్పారు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1.40 లక్షల నుంచి రూ.3.20 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు తరువాత ప్రకటిస్తామని కృష్ణారెడ్డి చెప్పారు. జాబ్‌మేళాను ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ టీపీవో డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement