అటవీ శాఖలో భారీ మార్పులు | Huge changes to the forest department | Sakshi
Sakshi News home page

అటవీ శాఖలో భారీ మార్పులు

Oct 3 2016 12:20 AM | Updated on Sep 26 2018 5:59 PM

జిల్లాల పునర్విభజనతో ఫారెస్ట్‌ శాఖలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూతనంగా ఏర్పడుతున్న మహబూబాబాద్‌ జిల్లాలో కొత్తగూడ మండలాన్ని కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాలో ఫారెస్ట్‌ శాఖ మహబూబాబాద్, గూడూరు డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

  • కొత్తగూడెం జిల్లాలోకి రెండు డివిజన్లు
  • వన్యప్రాణి సంరక్షణ విభాగం ఎత్తివేత
  • కొత్తగూడ : జిల్లాల పునర్విభజనతో ఫారెస్ట్‌ శాఖలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూతనంగా ఏర్పడుతున్న మహబూబాబాద్‌ జిల్లాలో కొత్తగూడ మండలాన్ని కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాలో ఫారెస్ట్‌ శాఖ మహబూబాబాద్, గూడూరు డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వాటికి ఎఫ్‌డీఓ (ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌)లు, ఒక జిల్లా ఫారెస్ట్‌ అధికారిని నియమిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు డివిజన్లు ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పడుతున్న కొత్తగూడెం జిల్లాలో కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారి పరిధిలోకి వెళ్తున్నాయి. కాగా మండలంలోని అటవీప్రాంతం 5 సెక్షన్లు, 14 బీట్లుగా కొత్తగూడ రేంజ్‌ పరిధిలో ఉంది. ఓటాయి సెక్ష¯ŒSలో పూనుగొండ్ల, ముస్మి–1, ముస్మి–2, పొగుళ్లపల్లి బీట్లు, మేడపల్లి సెక్ష¯ŒSలో ఎంచగూడెం నార్త్, ఎంచగూడెం సౌత్‌ బీట్లు నర్సంపేట రేంజ్‌ పరిధిలో, ఓటాయి సెక్ష¯ŒS పరిధిలో రాంపూర్, ఓటాయి, పూనుగొండ్ల బీట్లు వైల్డ్‌ లైఫ్‌ రేంజ్‌ పరిధిలో ఉండేవి. వాటిలో వైల్డ్‌లైఫ్‌ శాఖను పూర్తిగా మండలం నుంచి ఎత్తివేస్తూ ఆ ప్రాంతాన్ని అటవీశాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. నర్సంపేట రేంజ్‌ పరిధిలో ఉన్న బీట్లను కొత్తగూడ రేంజ్‌లో కలిపారు. కొత్తగూడ రేంజ్‌ పరిధిలో 6 సెక్షన్లు, 20 బీట్లుగా అటవీప్రాంతాన్ని విభజించారు. ప్రస్తుతం ఒక్క బీట్‌ పరిధిలో 3 వేల నుంచి 3500 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. దీన్ని 800 నుంచి వెయ్యి హెక్టార్ల లోపు ఒక్క బీట్‌గా విభజించేందుకు హద్దుల నిర్ణయం జరుగుతోంది.
    గంగారంలో కొత్త రేంజ్‌
    మండలంలోని గంగారం గ్రామంలో కొత్తగా రేంజ్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. తిరుమళగండి గ్రామం నుంచి దుబ్బగూడెం, ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిర్యాలపెంట వరకు విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని 6 సెక్షన్లు, 20 బీట్లుగా విభజించి గంగారం రేంజ్‌కు అప్పగించనున్నారు. దీంతో మండలంలో చిన్నచిన్న ఫారెస్ట్‌ బీట్లు ఏర్పడనున్నాయి. ఈమేరకు అధికారులు పూర్తి స్థాయి నివేదికలు జీపీఎస్‌ల ద్వారా రూపొందిస్తున్నారు. దీంతో అటవీ సంరక్షణ చాలా సులభమవుతుంది. అధికారుల సంఖ్య కూడా పెరుగుతుంది. పోడు వ్యవసాయం, అక్రమ కలప రవాణా పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చని ఆ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడ, గంగారం, గూడూరు రేంజ్‌లకు గూడూర్‌లో ఎఫ్‌డీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారం రోజుల క్రితం అదనపు పీసీసీఎఫ్‌ ఎంజే.అక్బర్‌ కార్యాలయాల పరిశీలన చేశారు. ఈదిశగా పనుల వేగవంతం చేస్తున్నారు.
    ‘వన్యప్రాణి సంరక్షణ’ తొలగింపుపై 
    అనుమానాలు
    వన్యప్రాణి సంరక్షణ విభాగం పూర్తి స్థాయిలో తొలగించి ఆ సెక్షన్లను మొత్తం ఫారెస్ట్‌ శాఖలో విలీనం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండలంలోని పూనుగొండ్ల, ఓటాయి గ్రామాలను ఆనుకుని వైల్డ్‌లైఫ్‌ సాంచురీ ఉంది. ఆ ప్రాంతం మొత్తం గుట్టలు, దట్టమైన అడవితో నిండి ఉంటుంది. వన్యప్రాణి సంరక్షణ విభాగం రేంజ్‌ పరిధి విస్తీర్ణంలో ఎక్కువ కావడం, సిబ్బంది పర్యవేక్షణ సరిగా ఉండక పోడు వ్యవసాయం, వన్యప్రాణుల వేట కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. కాగా వైల్డ్‌లైఫ్‌ సాంచురీ ప్రాంతంలోనే బొగ్గు, ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. రానున్న కాలంలో వాటిని వెలికి తీయాలంటే వన్యప్రాణి చట్టాల ప్రకారం కుదరదు. అందుకే ప్రభుత్వం వ్యూహత్మకంగా ఆ ప్రాంతాన్ని ఫారెస్ట్‌ శాఖకు బదలాయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారెస్ట్‌ చట్టాల ప్రకారం ఘనుల వెలికితీత కొంత సులభమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement