
చదువుకోవడం ఇష్టంలేక..
హాస్టల్‌లో ఉంటూ.. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచ లనం రేపింది.
♦ హాస్టల్‌లోని గ్రిల్‌కు తాడుతో ఉరేసుకున్న యువకుడు
♦ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి
♦ మండలంలోని అవుశాపూర్‌లో ఘటన
♦ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని
♦ బంధువుల ఆరోపణ ఆందోళన చేసిన కుటుంబీకులు
ఘట్‌కేసర్ : హాస్టల్‌లో ఉంటూ.. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచ లనం రేపింది. వివరాలు.. మండలంలోని అవుశాపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఉదయం సంఘటన జరగడంతో మృతుడి బం ధువుల పెద్దసంఖ్యలో పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని శాంతింపచేశారు. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా ఎం.ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన పెండెం శాంతికుమార్, శోభ దంపతులు 15 సంవత్సరాల క్రితం నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతానికి బతుకుదెరు వు నిమిత్తం వచ్చారు.
ఫొటోగ్రాఫర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు చిందుకుమార్, నందుకుమార్ ఉన్నారు. చిన్నకుమారుడు నందుకుమార్ (15)ను మండలంలోని ఎస్‌పీఆర్ (శ్రీపతిరెడ్డి) స్కూల్‌లో ఆరో తరగతిలో 2011 సంవత్సరంలో చేర్పిం చారు. ఈ క్రమంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి నందుకుమార్ బుధవారం ఉదయం హాస్టల్‌లో ఉన్న గ్రిల్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హాస్టల్‌లో ఉంటున్న పాఠశాల సిబ్బంది ఆ విషయా న్ని యాజమాన్యానికి తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. మృ తుడి తండ్రి శాంతకుమార్‌కు సమాచారం ఇచ్చారు. కానీ ఆయన పెద్దకుమారుడు చిందుకుమార్ మెడికల్ సీటు కౌన్సిలింగ్ కోసం అతడి భార్య శోభతో కలిసి డిల్లీ వెళ్లాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో విషయాన్ని తన స్వగ్రామంలోని తన సోదరులకు, బంధువులకు తెలి పారు. దీంతో వారు పాఠశాలకు చేరుకున్నారు.
ఖాళీ అయిన పాఠశాల..
నందుకుమార్ అనే హాస్టల్ విద్యార్థి ఆత్యహత్య చేసుకున్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ దుర్ఘటన జరగడంతోనే విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నామని పాఠశాల యాజమాన్యం వివరించింది.
చాలాసార్లు కౌన్సెలింగ్ ఇచ్చాం..
నందుకుమార్ అనే విద్యార్థి ఆరో తరగతిలో అడ్మిట్ అయ్యాడని ఎస్‌పీఆర్ పాఠశాల ఏఓ ఖలీమ్ చెప్పారు. అతడికి చదువుకోవాలని చాలాసార్లు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. గతంలో కూడా ఓసారి ఆత్మహత్య చేసుకోవడానికి ఇతడు ప్రయత్నించాడని తల్లిదండ్రులు తనకు తెలిపారని ఆయన చెప్పారు.
పోస్టుమార్టంనివేదికలో అన్నీ తెలుస్తాయి..
పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలూ తె లుస్తాయని సీఐ ప్రకాష్ తెలిపారు. మంగళవారం రాత్రే గ్రిల్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బంధువులు ఆరోపణ చేస్తున్న కో ణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తామన్నారు.
యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే మృతికి కారణం..
ఎస్‌పీఆర్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే నందకుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేశారు. విద్యార్థి మృతదేహంపై గాయాలు ఉన్నాయని, పాఠశాల వారే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఆందోళన చేస్తున్న కుటుంబీకులను పోలీసులు శాంతింపజేశారు.
వసతిగృహం నిర్వహణకు అనుమతి లేదు: ఎంఈఓ నర్సింహారెడ్డి
ఎస్‌పీఆర్ స్కూల్ డే స్కాలర్స్ పాఠశాల నడపడానికి మాత్రమే అనుమతి ఉందని, రెసిడెన్షియల్ స్కూల్ నడపడానికి అనుమతి లేదని ఎంఈఓ నర్సింహారెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా హాస్టల్ నడపడం చట్ట విరుద్ధం. ఈ విషయంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.