న్యాయమూర్తి ప్రేమావతికి ఘన సన్మానం | honor to district judge | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తి ప్రేమావతికి ఘన సన్మానం

Nov 15 2016 11:10 PM | Updated on Sep 4 2017 8:10 PM

న్యాయమూర్తి ప్రేమావతికి ఘన సన్మానం

న్యాయమూర్తి ప్రేమావతికి ఘన సన్మానం

బదిలీపై వెళ్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌.ప్రేమావతిని మంగళవారం సాయంత్రం కర్నూలు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది.

కర్నూలు(లీగల్‌): బదిలీపై వెళ్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌.ప్రేమావతిని మంగళవారం సాయంత్రం కర్నూలు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. గత మూడున్నర సంవత్సరాలుగా కర్నూలు ఫ్యామిలీ కోర్టు జడ్జిగా, మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తూ గత నెల 27న జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో ఆమెను గుంటూరు జిల్లా రెండో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎస్‌.చాంద్‌బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి మాట్లాడారు. న్యాయమూర్తుల బదిలీలు అనేది సర్వసాధారణమన్నారు. బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి ఎస్‌.ప్రేమావతి మాట్లాడుతూ.. తనకు అదనపు జిల్లా జడ్జిగా కర్నూలుకు ఇవ్వడంతో స్నేహితులు కర్నూలు ఫ్యాక్షన్‌ ఏరియా అని, రాయలసీమ అని భయపెట్టారని, కానీ తాను విన్నదానికి, ఇక్కడ ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి.రఘురాం, ఎం.ఎ.సోమశేఖర్, సి.కె.గాయిత్రి దేవి, ఎస్‌.పద్మిని, ఎం.బాబు, పి.రాజు, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సి.వి.శ్రీనివాసులు, కార్యవర్గ  సభ్యులు అనిల్‌కుమార్, తిరుపతయ్య, కరీం, గీతామాధురి, కోటేశ్వరరెడ్డి, రంగారవి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement