అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళ, బుధ వారాల్లో పుట్టపర్తిలో యూత్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఉత్సవానికి 69 దేశాల నుంచి 3000మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అనంతపురం జిల్లాలో టైస్టు కదలికల నేపధ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారు. పుట్టపర్తిలో అణువణువూ గాలిస్తున్నారు. ఉత్సవానికి వచ్చేవారి కదలికలపై నిఘా పెట్టారు.