రేపు ఉరవకొండకు హీరో రానా | hero rana came uravakonda | Sakshi
Sakshi News home page

రేపు ఉరవకొండకు హీరో రానా

Jan 1 2017 11:31 PM | Updated on Sep 5 2017 12:08 AM

ఉరవకొండలో మరోసారి షూటింగ్‌ సందండి ప్రారంభం కానుంది. బహుబలి ఫేం దగ్గుపాటి రానాతో పాటు ప్రముఖ నటీనటులంతా సందడి చేయనున్నారు.

ఉరవకొండ : ఉరవకొండలో మరోసారి షూటింగ్‌ సందండి ప్రారంభం కానుంది. బహుబలి ఫేం దగ్గుపాటి రానాతో పాటు ప్రముఖ నటీనటులంతా సందడి చేయనున్నారు. సురేష్‌ ప్రొడెక‌్షన్స్‌ పతాకం పై రానా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఉరవకొండలో చిత్రీకరించనున్నారు. 3న ఉరవకొండ ఎస్‌కె ప్రభుత్వ క్రీడా మైదానంలో పతాక సన్నివేశాలు షూట్‌ చేస్తారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ సుబ్బారాయుడు పర్యవేక్షణలో ఆదివారం సినిమాలో ఓ భారీ బహిరంగ సభకు సంభందించిన సెట్‌ ను సిద్ధం చేస్తున్నారు. గతంలో ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో నాని, మోహరూన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం దాదాపు 60 శాతానికి పైగా ఉరవకొండలోనే షూటింగ్‌ జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement