లిఫ్ట్లో ఇరుక్కున్న అల్లు అర్జున్, బోయపాటి | Hero allu arjun, director boyapati srinu stuck in lift | Sakshi
Sakshi News home page

లిఫ్ట్లో ఇరుక్కున్న అల్లు అర్జున్, బోయపాటి

May 27 2016 10:27 AM | Updated on Sep 4 2017 1:04 AM

లిఫ్ట్లో ఇరుక్కున్న అల్లు అర్జున్, బోయపాటి

లిఫ్ట్లో ఇరుక్కున్న అల్లు అర్జున్, బోయపాటి

దైవ దర్శనానికి వెళ్లిన సినీ హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను లిఫ్ట్లో ఇరుక్కుపోయారు.

విశాఖ: దైవ దర్శనానికి వెళ్లిన సినీ హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. సింహాచలం వరాహ నరసింహస్వామి దర్శించుకునేందుకు వెళ్లిన వీరికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. దర్శన అనంతరం  అల్లు అర్జున్, బోయపాటి లిఫ్ట్ ఎక్కగా, సాంకేతిక లోపంతో సగంలో నిలిచిపోయింది. వీరితో పాటు అభిమానులు కూడా పరిమితికి మించి ఎక్కేయడంతో లిఫ్ట్ ఆగిపోయింది.

దీంతో ఆలయ అధికారులు లిఫ్ట్ డోరు పగులగొట్టి వారిని బయటకు తీశారు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకుని అభిమానులను నిలువరించారు.  కాగా బన్నీ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' చిత్రం విజయవంతమైన విషయం తెలిసిందే. దీంతో వారు అప్పన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement