ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ..
ఏబీవీపీ రాస్తారోకో.. భారీగా ట్రాఫిక్జామ్
Jul 25 2016 12:23 PM | Updated on Oct 2 2018 8:08 PM
హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై బైఠాయించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ స్తంభించి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసన కారులను అడ్డుకున్నారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.
Advertisement
Advertisement