
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది. ఢిల్లీ వీధులు చెరువుల్లా మారాయి. ఈ క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. అయితే, ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా.. తన బైక్‌ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో బాహుబలి నగరంలోకి వచ్చేశాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
భారీ వర్షాలు కారణంగా గురుగ్రామ్- ఢిల్లీ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తమ బైక్‌ను భుజాలపై మోస్తూ నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ను జాగ్రత్తగా భుజాలపై బ్యాలెన్స్ చేస్తూ, కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండిపోయిన రోడ్డులో నడుస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది.
Bahubali! 🔥
Ft. Gurugram Rains Traffic Jam
A man carrying his scooter on his shoulder to bypass traffic jam after heavy rains.. pic.twitter.com/p7qO80dtUG— Keh Ke Peheno (@coolfunnytshirt) September 4, 2025
కాగా, యమునా నది వరద డేంజర్ మార్క్ దాటింది. పలు కాలనీలోకి వరద నీరు చేరుకుంది. యమునా బజార్ సహా పలు కాలనీలలో ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. దాదాపు 15 వేల మంది ప్రజలను తరలించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ వెల్లడించింది. మరో వారం పది రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి రోజు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. 67 సంవత్సరాల తర్వాత మూడోసారి 207 మీటర్ల డేంజర్ మార్కును దాటింది. వరద నీరుతో పాటు మురుగునీరు కూడా ప్రవహిస్తుంది. వరద మురుగతో ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.