గల్ఫ్‌ మోసాలపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ మోసాలపై ఉక్కుపాదం

Published Fri, Jan 6 2017 1:15 AM

గల్ఫ్‌ మోసాలపై ఉక్కుపాదం - Sakshi

పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ

నిజామాబాద్‌ క్రైం : గడిచిన మూడేళ్లలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో 50 గల్ఫ్‌ కేసులు నమోదు అయ్యాయని, ఇక నుంచి గల్ఫ్‌ మోసాలపై ఉక్కు పాదం మోపాలని పోలీస్‌ కమిషనర్‌ కార్తి్తకేయ కిందిస్థాయి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సీపీ కార్యాలయంలో గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గల్ఫ్‌ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన టీమ్‌ను ఏసీపీ అధికారి నేతృత్వంలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేశామన్నారు. ట్రావెల్‌ ఏజెంట్లు మోసపూరితమైన వీసా, పాస్‌పోర్టు ఇప్పించిన వారి వివరాలు సేకరిస్తామన్నారు.

మాబ్‌ ఆపరేషన్‌పై అవగాహన..
సంఘవిద్రోహ శక్తులు విధ్వంసకర చర్యలకు పాల్పడినప్పుడు వారిని ఎదుర్కొనే చర్యలు మాబ్‌ ఆపరేషన్‌పై పోలీస్‌ కమిషనర్‌ కార్తీకేయ పోలీస్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు. గురువారం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ డివిజన్ల పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల సిబ్బందికి మాబ్‌ ఆపరేషన్‌పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు విధ్వంసకర చర్యలకు పాల్పడినప్పుడు వారి ఆగడాలను ఏ విధంగా అడ్డుకుని నివారించాలో మెళకువలపై తరగతులను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ ఏసీపీ సయ్యద్‌ అన్వర్‌ హుస్సేన్, ఆర్‌ఐ సీహెచ్‌ మల్లికార్జున్, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.
   

Advertisement
Advertisement